అతను మా లోపాలను ఎత్తి చూపుతాడు : అశ్విన్
అంతేకాకుండా టీమిండియాలో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో ఎంతో నాణ్యతను శార్దూల్ ఠాకూర్ తీసుకువచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. ఒక చిట్ చాట్ కార్యక్రమంలో రవిచంద్రన్ అశ్విన్ ఈ సమాధానాలు చెప్పారు. దీనికి సంబంధించి వీడియోని విడుదల చేసింది బిసిసీఐ. 2020 - 21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆల్ రౌండర్ ప్రార్ధన ఠాగూర్ అద్భుతంగా రాణించాడు. వరుసగా అర్థ శతకాలు సాధించి ప్రశంసలు అందుకున్నాడు.. భారత బ్యాట్స్మెన్ లు విదేశాల్లో ఎక్కువగా షార్ట్ లెన్త్ బంతులను ఆడేందుకు ప్రయత్నించి వికెట్ చేజార్చుకుంటూ ఉంటారు.
కానీ యువ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఆస్ట్రేలియా గడ్డ మీద షార్ట్ లెన్త్ బంతులలో కూడా అద్భుతమైన షాట్లు ఆడి పరుగులు రాబట్టగలిగాడు అంటూ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. మా అందరి బ్యాటింగ్ లో ఎలాంటి లోపాలు ఉన్నాయి అన్నది ఠాగూర్ తన బ్యాటింగ్తో ఎత్తి చూపుతాడని చెప్పుకొచ్చాడు. శార్దూల్ ఠాకూర్ ఇదే ఫామ్ అటు దక్షిణాఫ్రికాలో కొనసాగించాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్ సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ జరుగుతుంది.