కెప్టెన్సీ పోవడం.. కోహ్లీకి వరం : రవి శాస్త్రి

praveen
గత కొంత కాలం నుంచి భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పు  గురించి చర్చ జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. తాను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగడంతో ఎంతగానో ఒత్తిడికి లోనవుతున్నానని.. అందుకే టి20 కెప్టెన్సీ నుంచి తప్పించుకుంటున్నా అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే టి 20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత ఇక టీమిండియాకు కొత్త కెప్టెన్ గా  రోహిత్ శర్మను నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించడం సంచలనంగా మారింది.


 దీంతో విరాట్ కోహ్లీని అటు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రం పెద్ద వివాదంగా మారి పోయింది అని చెప్పాలి. ఎందుకంటే తాను వన్డే కెప్టెన్సీ తప్పు కుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పకముందే అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించటం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పించే ముందు విరాట్ కోహ్లీ కి సమాచారం అందించామని బిసిసిఐ చెప్పింది. అయితే తనకు ఎలాంటి సమాచారం అందించ కుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారు అంటూ  విరాట్ కోహ్లీ చెప్పడంతో కెప్టెన్సీ మార్పు వివాదం కాస్త మరింత ముదిరింది అని చెప్పాలి.


 ఇక కెప్టెన్సీ మార్పు వివాదంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇటీవలే టీమిండియా మాజీ కోచ్ కామెంటేటర్ రవిశాస్త్రి ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే కెప్టెన్సి విరాట్ కోహ్లీ ని తప్పించడం అతనికి వరంగా మారబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. టీమ్ ఇండియా  ముందుకు సాగేందుకు ఇది సరైన మార్గమని చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి. బయో బబుల్ లో మూడు ఫార్మాట్లలోనూ ఒక్కరే కెప్టెన్ గా ఉండడం ఎంతో కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ ల పై పూర్తి దృష్టి పెట్టి ఐదారేళ్లలో ఆట గురించి ఆలోచించుకునే సమయం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: