టీమ్ ఇండియా vs సౌత్ ఆఫ్రికా.. అందరి దృష్టి అతనిపైనే?
టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా పేరున్న అజింక్య రహానే టెస్టుల్లో భారీ స్కోరు చేసి చాలా కాలమే అయ్యింది. టీమిండియా అజింక్యా రహానే పై నమ్మకం ఉంచి అటు తుది జట్టులో అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల స్వదేశంలో అజింక్యా రహానే సెంచరీ చేసి అభిమానుల నిరీక్షణకు తెర దించుతూతాడు అని అందరూ అనుకున్నారు. ఇక తాను ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉన్నాను అంటూ ఆజింక్య రహానే కూడా చెప్పుకొచ్చాడు.. కానీ మళ్లీ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు అజింక్యా రహానే. దీంతో ఇక బీసీసీఐ ఆతన్ని వైస్ కెప్టెన్ గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో మాత్రం అజింక్య రహనే ను ఎంపిక చేసింది బీసీసీఐ .
అజింక్య రహనేకు సౌత్ ఆఫ్రికా పర్యటనలో మంచి పరుగులు చేసిన అనుభవం ఉండటం గమనార్హం. అయితే ప్రస్తుతం టీమిండియా అభిమానులు అందరి దృష్టికి కూడా అజింక్య రహానే పైనే ఉంది.. అదే సమయంలో నేడు సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో అసలు అజింక్య రహనే తుది జట్టులో స్థానం దక్కుతుందా లేదా అన్నది కూడా అందరిలో నెలకొన్న ప్రశ్న. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న అజింక్య రహానే రోజురోజుకీ అటు టీమిండియాకు భారంగా మారి పోతూనే ఉన్నాడు. అయినప్పటికీ అతను జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే అతను మళ్లీ ఫామ్ లోకి రావడానికి ఒకే ఒక్క మ్యాచ్ సరిపోతుందని ఇక అతనికి సౌత్ ఆఫ్రికా గడ్డపై భారీ స్కోరు చేసిన అనుభవం కూడా ఉండటంతో అతని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.