'పుష్ప' రవీంద్ర జడేజా యాక్టింగ్.. వైరల్?
రా కంటెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా చూసిన తర్వాత ఎవరిని చూసినా కూడా పుష్ప సినిమాలోని డైలాగులు చెబుతూ ఉండటం గమనార్హం సోషల్ మీడియాలో కూడా పుష్ప సినిమా డైలాగులపై ఎంతోమంది యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఏకంగా ఒక భారత స్టార్ ఆల్రౌండర్ ప్రస్తుతం పుష్ప సినిమాలోని ఒక పవర్ ఫుల్ డైలాగ్ పై యాక్టింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది.
ప్రస్తుతం టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా మూడు ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోని తగ్గేదిలే డైలాగ్ తనదైన శైలిలో యాక్టింగ్ చేసి అలరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. పుష్ప పుష్పరాజ్ నీయవ్వ తగ్గేదెలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తనదైన శైలిలో చెప్పిన అదరగొట్టాడు రవీంద్ర జడేజా. అయితే ఈ డైలాగ్ సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎంతగానో ఆకర్షిస్తూ ఉండడం గమనార్హం.