అభిమానులకు షాక్.. మెగా వేలానికి అతను దూరం?
ఈ క్రమంలోనే అటు స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా భారీగా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక ప్రస్తుతం రికార్డు స్థాయిలో మెగా వేలంలో ఏ ఆటగాడు పలక పోతున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే గత ఐపీఎల్ సీజన్లో రాణించిన ఎంతో మంది బౌలర్లకు ఈసారి భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది అందరూ భావించారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో అభిమానులకు షాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్. ఐపీఎల్ 2022 సీజన్ కు దూరం కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించాడు.
ఇటీవలే గాయం బారిన పడ్డాడు ఇంగ్లాండ్ సార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఇక గాయం కారణంగా మెగా వేలం లో పాల్గొనడం లేదు అంటూ ప్రకటించాడు ఇక తాజాగా రెండోసారి అర్చర్ చేతికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతనికి 15 నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అయితే 2021 సీజన్ కి కూడా జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇటీవలే అతని రిటైన్ చేసుకోకుండా మెగా వేలంలో కి వదిలేసింది జట్టు యాజమాన్యం.