చిర్రెత్తిపోయిన పాక్ క్రికెటర్.. రిపోర్టర్ ను ఏమన్నాడో తెలుసా?

praveen
టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో జరిగిన మ్యాచ్లో కీలక సమయంలో కీలక క్యాచ్ వదిలేసి తీవ్రస్థాయిలో విమర్శలు పాలయ్యాడు పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ. ఎన్నో రోజుల పాటు ఇక పాకిస్తాన్ బౌలర్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి  అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి కూడా చేశారు. ఆ తర్వాత స్పందించిన హసన్ అలీ  క్యాచ్ వదిలేసినందుకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక ఇటీవలే మరో సారి ఈ పాకిస్తాన్ బౌలర్ వార్తల్లో నిలిచాడు. జర్నలిస్టుతో వాదనకి దిగి దురుసుగా ప్రవర్తించాడు అన్న  మరో అపవాదును మూటగట్టుకున్నాడు హసన్ అలీ.



 పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతి ఏటా పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇక ఇందులో ఇస్లామాబాద్ యునైటెడ్ కు హసన్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ప్లేయర్స్ డ్రాఫ్ట్ లిఫ్ట్ ప్రకటిస్తున్న సందర్భంగా ఒక జర్నలిస్టు పదేపదే హసన్ అలీని చిత్రవిచిత్రమైన ప్రశ్నలతో చిరాకు తెప్పించాడు. ఇలాంటి సమయంలోనే ఇక అతని మాట్లాడకుండా అతడు ఏ ప్రశ్న అడిగినా తర్వాత ప్రశ్న ఏంటి అంటూ సమాధానం దాటవేస్తూ వచ్చాడు హసన్ అలీ.  దీంతో జర్నలిస్టుకు కోపం వచ్చింది. మీ పద్ధతి బాగా లేదని హసన్ అలీపై విసుక్కున్నాడు.


 ఇక దీనిపై స్పందించిన హాసన్ అలీ ముందు మీరు  ట్విట్టర్ లో మంచి రాతలు రాయడం నేర్చుకోండి..  తర్వాత నేను కూడా బాగానే సమాధానాలు చెప్తాను.. ఒక వ్యక్తిని    టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీ ప్రశ్నలను ఆప లేదేమో కనీసం మాకైనా హక్కు ఉంది కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న అధికారి హసన్ అలీని సముదాయించాడు. దీంతో వెంటనే కూల్ అయ్యాడు. అయితే ఇటీవలే ప్రశ్నలు అడిగినా జర్నలిస్టు అనాస్  గతంలో హసన్ అలీపై ట్విట్టర్ వేదిక విమర్శలు గుప్పించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించాలి అంటూ సోషల్ మీడియాలో హసన్ అలీకి  సూచించాడు. ఇక ఆ పాత వివాదమే ఇక ఇప్పుడు  ఇలా మాట్లాడడానికి కారణం అని అనుకుంటున్నారు అందరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: