దూసుకుపోతున్న వార్నర్.. ఇలా అయితే రికార్డులే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరిచూపు ఐపీఎల్ 2022 పైనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే  ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ మెగా వేళ నిర్వహిస్తుండడంతో ఈ మెగా వేలంలో ఎవరికీ భారీగా డిమాండ్ ఉండబోతోంది అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్ ని వేలంలో కి వదిలేసింది. అయితే గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా ఉన్న డేవిడ్ వార్నర్ ను ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది యాజమాన్యం.



 మొదట కెప్టెన్సీ నుంచి తొలగించడం.. ఆ తర్వాత జట్టులో స్థానం కల్పించకపోవడం చేసింది. ఒకానొక సమయంలో డేవిడ్ వార్నర్ ను హోటల్ గదికి మాత్రమే పరిమితం చేసింది. కనీసం మైదానంలోకి వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఎంతగానో నిరాశ చెందారు..  ఇక ఇటీవలే  డేవిడ్ వార్నర్ రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. దీంతో డేవిడ్ వార్నర్ కు మెగా వేలంలో భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్ కప్ లో డేవిడ్ వార్నర్ ఎంత అద్భుతంగా రాణించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఆస్ట్రేలియా జట్టు టి-20 వరల్డ్ కప్ గెలవడం లో డేవిడ్ వార్నర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఇక ఇప్పుడు టెస్టుల్లో కూడా అదరగొడుతున్నాడు డేవిడ్ వార్నర్. వరుసగా భారీ పరుగులు చేస్తున్నాడు. ఇక డేవిడ్ వార్నర్ ఫామ్ చూస్తే ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఎంత సమర్ధుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..  ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కూడా ఉన్నాడు.. అలాంటి స్టార్ ప్లేయర్ ని వదులుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఇష్టపడదని.. అందుకే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: