సిఎస్కె తర్వాత కెప్టెన్ అతనేనట?

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భారత దిగ్గజ క్రికెటర్ మిస్టర్ కూల్  మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక  దిగ్గజ జట్టుగా కొనసాగుతోంది. ధోని సారథ్యంలో ఎంతో సమర్థవంతంగా ప్రతి సీజన్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే 2019లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

 అయితే తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే ధోని ఎప్పుడు పూర్తిగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఒకవేళ ధోని పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తర్వాత కెప్టెన్ ఎవరు అనే దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. అయితే గతంలో ఇలాంటి ప్రశ్న ఎదురైన సమయంలో  తానే చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత కెప్టెన్ అంటూ రవీంద్ర జడేజా ఏకంగా తనజెర్సీ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టి ఆ తర్వాత డిలీట్ చేశాడు.

 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు ధోని తర్వాత తదుపరి కెప్టెన్ ఎవరు అనే దానిపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ధోనీ వారసుడిగా డుప్లెసిస్ సరిపోతాడని సైమన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ధోని వచ్చే సీజన్ అంతా ఆడతాడు అని ఎవరూ భావించడం లేదు. చెన్నై లో మహేంద్ర సింగ్ ధోని చివరి మ్యాచ్ ప్రకటిస్తే అక్కడినుంచి డూప్లెసిస్ బాధ్యతలు చేపడతాడు.. ఇక ధోని డూప్లెస్ తోపాటు రవీంద్ర జడేజా రుతు రాజ్ గైక్వాడ్ లను అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రిటైన్ చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk

సంబంధిత వార్తలు: