హిట్ మ్యానా మజాకా.. అరుదైన రికార్డు?
అయితే రోహిత్ శర్మ ఎప్పుడు బరిలోకి దిగిన కూడా భారీ సిక్సర్లతో ఆదర కొడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో సిక్సర్లు బాది తో భారీగా స్కోర్లు చేస్తూఉంటాడు. అయితే ఇక కెప్టెన్ గా మారిన తర్వాత మరింత నిలకడగా రాణిస్తున్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టీ-20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లలో కూడా అద్భుతంగా రాణించాడు. కెప్టెన్గా ఒకవైపు జట్టును సమన్వయంగా ముందుకు నడిపిస్తూనే ఓపెనర్గా తన పాత్రను ఎంతోసమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. అయితే ఇక ఇటీవలే రెండో టీ20లోటీమ్ ఇండియా జట్టు అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
కాగా ఇటీవలే రెండో టీ20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ కేవలం 403 ఇన్నింగ్సులో 450 సిక్సర్లు కొట్టాడు. ఇక ఆ తర్వాత స్థానంలో షాహిద్ ఆఫ్రిది 487 ఎన్నికలలో 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ కు 499 ఇన్నింగ్స్ 456 కొట్టడానికి అవసరం కావడం గమనార్హం.. అయితే ఈ రికార్డు సాధించిన మొదటి భారత ప్లేయర్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.