తుది జట్టులో యంగ్ డైనమైట్... ఇక మెరుపులేనా?
తాను ఆడిన మొదటి ఐపీఎల్ సీజన్ లోనే అద్భుతమైన ఆటతీరును కనబరిచిన వెంకటేష్ అయ్యర్ ను ద్రావిడ్ మొదటి మ్యాచ్ లోనే తుది జట్టులో అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకు ముందే వెంకటేష్ అయ్యర్ కు రాహుల్ ద్రావిడ్ డెబ్యూ క్యాప్ ను అందించాడు. దీనితో అందరికీ వెంకటేష్ అయ్యర్ పై అంచనాలు ఎక్కువయ్యాయి. ఐపీఎల్ ఆడినంత ఈజీగా అంతర్జాతీయ స్థాయిలో ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏ విధంగా రాణిస్తాడు అన్న విషయం అంతా చర్చించుకుంటున్నారు.
మొదట కొన్ని బంతులు ఆచి తూచి ఆడితే పిచ్ స్వభావం అర్ధమవుతుంది. అప్పుడు తన సహజమైన ఆటతీరును కొనసాగించవచ్చు. మరి ఐపీఎల్ లాగే ఇక్కడ కూడా మెరుపులు మెరిపిస్తాడా లేదా అన్నది తెలియాలంటే సెకండ్ ఇన్నింగ్స్ వరకు వేచి చూడాలి. ఎందుకంటే టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే పిచ్ ప్రకారం ఇక్కడ చేజింగ్ చేసే జట్లకు మంచి రికార్డు ఉంది. మరి చివరికి ఫలితం ఎలా ఉండనుంది అన్నది తెలియాల్సి ఉంది.