టి20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. టీమిండియాలో అతనిపై వేటు?

praveen
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా టి20 వరల్డ్ కప్ లో ఎంతో ఘోరంగా విఫలమయింది. గెలవాల్సిన మ్యాచ్లో కూడా ఓడిపోయి చివరికి సెమీఫైనల్కు వెళ్ళలేక ఇంటిదారి పట్టింది. వరుసగా రెండు మ్యాచ్లలో పేలవ ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్లలలో అద్భుతంగా పుంజుకున్నప్పటికి చివరికి సెమీఫైనల్కు వెళ్లే అవకాశాలు అప్పటికే మూసుకుపోయాయి. అయితే టీమ్ ఇండియా లో భారీ అంచనాలు పెట్టుకున్న బ్యాట్స్మెన్లు ఎవరు కూడా అంతగా రాణించలేదు  అనే చెప్పాలి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తాడు అని అనుకున్నారు అందరు.



కానీ ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఇక మొదటి రెండు మ్యాచ్లలో అయితే పూర్తిగా హార్దిక్ పాండ్యా తేలిపోయాడు. ఆ తర్వాత మ్యాచ్లో 1, 2బౌండరీల తో మళ్ళీ ఫాంలోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ  పూర్తిస్థాయిలో మాత్రం రాణించలేకపోయాడు. అయితే ఇటీవలే 20 ప్రపంచకప్లో టీం ఇండియా విఫలం కావడాన్ని  బీసీసీఐ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించి టీమిండియాను వచ్చే ప్రపంచకప్ కోసం పటిష్టంగా మార్చాలని భావిస్తోంది.


 ఇలాంటి నేపథ్యంలోనే ఇక టి20 వరల్డ్ కప్ లో ఘోరంగా విఫలం కావడంతో బీసీసీఐ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్ కోసం బీసీసీఐ జట్టు ఎంపికలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే బౌలింగ్ కు దూరమై ఇటు బ్యాటింగ్లో కూడా రాణించలేక పోతోన్నా హార్దిక్ పాండ్యా పై వేటు వేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. భుజం గాయం నుంచి కోలుకుని పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేక.. చివరికి బౌలింగ్ కు కూడా దూరంగా ఉన్న హార్థిక్ పాండ్యను 120 వరల్డ్ కప్ లో ఎలా సెలెక్ట్ చేస్తారు అని సెలెక్టర్లను బిసిసిఐ నివేదిక అడిగినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: