రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?
ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియా జట్టును ఓపెనర్గా ముందుండి నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. కెప్టెన్ కాకపోయినప్పటికీ ఓపెనర్ గా మాత్రం బద్దలు కొడుతూ టీమ్ ఇండియాకు ఎప్పుడు భారీ స్కోర్లు అందించడంలో ముందుంటాడు. అయితే ఇప్పటి వరకు టీమిండియాకు ఎన్నోసార్లు రోహిత్ శర్మ ఒంటిచేత్తో విజయాలను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాదు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియాకు విజయాన్ని అందించే ఒక అద్భుతమైన ప్లేయర్ గా మారిపోయాడు.
అయితే ఇక తన ఆటతో ఏకంగా అభిమానులకు హిట్ మాన్ గా మారిపోయాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే రికార్డ్ కూడా సాధించాడు స్టార్ ఓపెనర్. అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేల పరుగులు సాధించిన మూడవ ఆటగాడిగా అరుదైన రికార్డును సాధించాడు. 108 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే హిట్ మాన్ కంటే ముందు విరాట్ కోహ్లీ 3227 పరుగులు, మార్టిన్ గప్టిల్ 3115 పరుగులు తో వరసగా రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టి20 ల్లో 4 సెంచరీలు చేసింది కేవలం రోహిత్ శర్మ మాత్రమే కావడం గమనార్హం.