దీని కోసమే ఎదురు చూస్తున్నా : విరాట్ కోహ్లీ
సెమీస్ అవకాశాలను కూడా దాదాపుగా మూసుకుపోయాయి అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో మూడవ మ్యాచ్ నుంచి టీమిండియా పుంజుకున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడో మ్యాచ్‌లో కూడా టీమిండియా పేలవ ప్రదర్శనతో ఓడిపోతుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా పుంజుకుంది టీమిండియా. ప్రత్యర్థి జట్టుపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించి ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రన్‌రేట్ ఒక్కసారిగా మెరుగుపరుచుకుంది. ఇక ఇటీవలే స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అయితే టీమిండియా బ్యాట్స్‌మెన్ విజృంభించారు అనే చెప్పాలి.
ప్రత్యర్థి స్కాట్లాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించారు. ప్రత్యర్థి జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఊది పడేశారు భారత బ్యాట్స్మెన్లు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. స్కాట్ ల్యాండ్ తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఆటతీరు కోసమే ఎదురు చూస్తున్నాము అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో మా ప్లాన్ కు తగినట్లుగానే ఆడాము అనుకున్నట్లే చేసాం ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఇలాంటి ప్రదర్శన కనబరిచాము. కానీ మొదటి రెండు మ్యాచ్ లలో కనీసం రెండు ఓవర్లలో అయినా ఇలాంటి ప్రదర్శన చేసి ఉంటే బాగుండేది.. ఏదేమైనప్పటికీ మా వాళ్లు అదరగొడుతున్నారూ అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.