టి20 వరల్డ్ కప్ : భారత్ కి సెమీస్ అవకాశాలు?

praveen
టి20 ప్రపంచకప్లో టీం ఇండియా అంచనాలను అందుకోలేక పేలవా ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అందరికీ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. మొదటి మ్యాచ్లో దాయాది దేశమైన పాకిస్థాన్ తో ఘోర ఓటమిని చవి చూసిన టీమిండియా ఇక రెండో మ్యాచ్లో కూడా పుంజుకోలేకపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పేలవ ప్రదర్శన చేయడంతో ఇక రెండో మ్యాచ్ లో కూడా చిత్తుగా ఓడిపోయింది.


 అయితే అటు వరుసగా రెండు ఓటములతో పాటు అటు టీమిండియా రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండడంతో టీమ్ ఇండియా సెమీఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఎంతో ఇష్టం గా మారిపోయాయి అనే చెప్పాలి. అయితే టీమిండియా సెమీస్కు వెళ్లాలంటే అద్భుతం జరగాల్సి ఉంది. కానీ మూడో మ్యాచ్లో ఎంతో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉంటుంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించడంతో ఇక సెమీస్ అవకాశాలను టీమిండియాకు చేరువగా వస్తున్నాయి అని చెప్పాలి.


 సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మెరుగైన రన్రేట్ సాధించాల్సిన సమయంలో భారత్ ఆల్ రౌండ్ షోతో రాణించింది. రెండు మ్యాచ్ల్లో మాదిరిగానే టాస్ ఓడిన కోహ్లీసేన ఈసారి మాత్రం అద్భుతంగా రాణించి 210 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఏకంగా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే గ్రూప్2 పాయింట్లు పట్టిక లో ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో ప్లేస్ లోకి వచ్చింది. అయితే ఇప్పటికి కూడా కోహ్లీ సేన ఫైనల్ చేరాలంటే అంత తేలికేం కాదు. న్యూజిలాండ్ తన ఆఖరి రెండు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్లో ఓడినా కూడా టీమిండియాకు మంచి అవకాశాలు ఉంటాయి. అదేసమయంలో టీమిండియా మిగతా రెండు మ్యాచ్ లలో భారీ తేడాతో స్కాట్లాండ్ నమీబియా లపై విజయం సాధించాలని ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: