ఫామ్ లో కొచ్చిన డేవిడ్ వార్నర్ పై కొత్త జట్ల కన్ను... ?
గత కొంత కాలంగా ఇతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టులో ఇతడి పాత్ర ఎంత ప్రధానమంటే సన్‌రైజర్స్ అనగానే వార్నర్ పేరు గుర్తుకు రావాల్సిందే. ఎన్నో సార్లు ఇతడు మ్యాచ్ ని నిలబెట్టిన సందర్భాలున్నాయి. 2016 సంవత్సరంలో టైటిల్‌ను అందుకోవడంలో ఇతడే కీలకమని చెప్పాలి. అలాంటి గొప్ప బ్యాట్స్ మాన్ ఇపుడు ప్రస్తుత ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నారు. వరుసగా జరిగిన రెండు దశల ఐపీఎల్ 14వ సీజన్లోనూ తన సత్తా చాటడంలో వెనుకబడ్డాడు. అలా విఫలం యొక్క పర్యవసానం యూఏఈ ఎడిషన్‌లో కెప్టెన్సీతోపాటు జట్టులోనూ స్థానాన్ని కోల్పోయారు.
వార్నర్ స్థానంలోకి కేన్ విలియమ్సన్ కి టీం సారథ్య బాధ్యతలు కట్టబెట్టారు. అయినా అతడి సాహిత్యంలోనూ జట్టుకు విఫలమే ఎదురయ్యింది. సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ఇటువంటి సందర్భంలో ఇపుడు అందరి దృష్టి తదుపరి వచ్చే ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం లో డేవిడ్ వార్నర్ ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ జట్టు తనను అంటి పెట్టుకుంటుందన్న నమ్మకం లేదు అని నిరాశతో చెప్పాడు. అయితే ఈ సారి కొత్తగా వస్తున్న ఏ జట్టు అయినా భారీ మొత్తానికి కొనుగోలు చేసి కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది.