టీ20 వరల్డ్ కప్‌లో దూసుకెళ్తున్నపాక్.. వరుసగా రెండో విజయం..!

Chakravarthi Kalyan
టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్ దూసుకెళ్తోంది. వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ బీలో ఉన్న ఆ జట్టు తాజా న్యూజీలాండ్‌ను మట్టి కరిపించింది. ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ లక్ష్యాన్ని చేదించి రెండో విజయం అందుకుంది. ఈ విజయం ద్వారా గ్రూప్‌ బిలో పాకిస్తాన్ అగ్రస్థానానికి వెళ్లింది. గ్రూప్ బిలో ఇప్పటి వరకూ రెండు మ్యాచ్ లు అడిన పాకిస్తాన్ రెండింటిలోనూ గెలిచింది. న్యూజీలాండ్ పెట్టిన తక్కువ టార్గెట్‌ 135ను ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ ఛేదించింది.

టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సూపర్‌ 12 గ్రూఫ్‌ -2లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆసక్తికరంగా ఈ మ్యాచ్‌ జరిగింది. మరోసారి పాక్‌ను టాస్‌లో విజయం వరించింది. ఈసారి కూడా పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ నే ఎంచుకుంది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే పాకిస్తాన్‌ మంచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ఇక  న్యూజిలాండ్‌ కు సూపర్‌ 12 దశలో ఇదే తొలి మ్యాచ్‌.

ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. పాక్‌ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేశారు. దీంతో న్యూజిలాండ్‌ బ్యాటర్స్‌ పరుగుల వేటకు కష్టించాల్సి వచ్చింది. డెవన్‌ కాన్వే, డారిల్‌ మిచెల్‌ చెరో 27 పరుగులు చేశారు. కేన్‌ విలియమ్సన్‌ 25 పరుగులు మాత్రమే చేశాడు. ఇక పాక్‌ బౌలింగ్ విషయానికి వస్తే.. హారిస్‌ రౌఫ్‌ 4 వికెట్లతో చెలరేగాడు. షాహిన్‌ అఫ్రిది, ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ హఫీజ్‌.. వీరంతా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

న్యూజీలాండ్ విధించిన 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ షోయబ్‌ మాలిక్‌(26*), ఆసిఫ్‌ అలీ(27*) వీరవిహారంతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో పాక్‌ను గెలిపించిన రిజ్వాన్ మరోసారి మెరిసాడు. ఓపెనర్‌ రిజ్వాన్‌ 33 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలింగ్ విషయానికి వస్తే.. ఇష్‌ సోదీ 2 వికెట్లు తీశాడు.  బౌల్ట్‌, మిచెల్‌ సాంట్నర్‌, సౌథీ ఒక్కో వికెట్‌ తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: