వావ్.. మారిపోనున్న ఐపీఎల్ ఫార్మాట్?
కాగా ప్రస్తుతం ఐపీఎల్లో ఎనిమిది జట్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ ఎనిమిది జట్లు మధ్య ప్రతి సీజన్లో కూడా ఎంతో హోరాహోరీ పోరు జరుగుతూనే ఉంటుంది. అయితే ఐపీఎల్ ఎంటర్ టైన్ మెంట్ ను మరింత పెంచేందుకు అటు బిసిసిఐ గత కొన్ని రోజుల నుంచి తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లోకి మరో రెండు కొత్త జట్లను తీసుకురావాలని బిసిసిఐ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఇటీవలే ఐపీఎల్ లోకి వచ్చే రెండు జట్లు ఏవి అన్నది కూడా ఫిక్స్ అయిపోయింది.
ఇకపోతే ఐపీఎల్ లో కి రెండు కొత్తజట్లు వచ్చిన తర్వాత టోర్నీ తీరును మొత్తం మార్చడానికి బిసిసిఐ ప్లాన్ చేస్తోందట. ఇప్పటివరకు కేవలం 8 జట్లు మాత్రమే ఐపీఎల్లో తలపడగా ఇక వచ్చే సీజన్ నుంచి మాత్రం పది జట్లు పోటీ పడబోతున్నాయి. అయితే ఎప్పటి లాగానే లీగ్ దశలో ఒక జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. కానీ 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కొక్క గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ఇక ఈ ఐదు జట్ల మధ్య హోమ్ 4, అవే 4 అంటూ 8 మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత మరో గ్రూప్ నుండి ఒక్కొక్క జట్టుతో ఒక మ్యాచ్.. ఇక ఆ తర్వాత ఒక జట్టుతో రెండు మ్యాచ్లు జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాగా ఇలాంటి సరికొత్త ఫార్మాట్ ని ఐపీఎల్ లో అమల్లోకి తీసుకురావాలని బిసిసీఐ ప్లాన్ చేస్తోంది.