టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పాక్...

M Manohar
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా Vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం అయింది. అయితే చివరి సారిగా 2019 వన్డే ప్రపంచకప్ లో పోటీ పడిన ఈ రెండు జట్లు దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్లీ ఐసీసీ టోర్నమెంట్ అయిన టి20 ప్రపంచ కప్ లో పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బౌలింగ్ తీసుకొని మన భారత జట్టును ముందు బ్యాటింగ్ కు పంపించాడు. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టు కేవలం ఇద్దరు స్పిన్నర్ల తో అలాగే ముగ్గురు పేసర్ లతో తలపడుతుంది. ఇక బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న హార్దిక్ పాండ్య కూడా ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. అలాగే తప్పకుండా ఈ జట్టులో ఉంటాడు అనుకున్న రవిచంద్రన్ అశ్విన్ అలాగే శార్దుల్ ఠాకూర్ కు నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ఇప్పటివరకు మొత్తం ఐదు టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో పోటీపడిన ఈ రెండు జట్లలో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది. మొత్తం ఐదుకు ఐదు మ్యాచ్ లో మన టీం విజయం సాధించింది. దానిని మ్యాచ్లో ఈ విజయం సాధించి 6-0 చేయాలనుకుంటున్నా భారత్... అలాగే ఎలాగైనా ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్రపంచకప్లో శుభరంభం చేయాలనీ చూస్తుంది పాకిస్తాన్. అయితే చూడాలి మరి ఇందులో ఎవరు విజయం ఇస్తారు అనేది.
భారత జట్టు : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజామ్ (c), మొహమ్మద్ రిజ్వాన్ (wl), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: