ఇండియా గెలవాలని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్న అభిమానులు ??

Surya

భరత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరిలో తెలియని ఉత్కంఠ మొదలవుతుంది. ఆ సందర్భం ఇప్పుడు రానే వచ్చింది , నరాలు తెగే ఉద్వేగ భరితమైన క్షణాలు రానే వచ్చాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్‌ 2021  లో భాగంగా సూపర్ 12  లో ఉన్న భరత్- పాకిస్తాన్ జట్లు ఈ ఆదివారం సాయంత్రం 7:30 గం.నిలకు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ని ఆస్వాదించడానికి స్టేడియం లో అభిమానులు రెడీగా ఉన్నారు. అభిమాన ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు   4 ,6  లుకొడితే స్టేడియం లో సంబరాలను జరుపుకుందామా అని ఎదురుచూస్తున్నారు .  సాదరంగా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే అభిమానుల సందడి అంత ఇంత ఉండదు వారి హడావిడికి అవధులు వుండవు. ఈ ఉద్వేగ భరిత సందర్భాలను వివరించడానికి మాటలు కూడా చాలవు. ప్రస్తుతం ఇండియన్స్ కి  క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఈ ఆదివారం మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతు ఉంది.



ఈ మ్యాచ్  లను అభిమానులు కలసి చూసేందుకు సన్నాహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. దుబాయ్ లో ఈ మ్యాచ్ జరుగుతున్నందున అందరిలో ఒకంత గుబులు పట్టుకుంది . ఎందుకంటె అక్కడి పిచ్ లు పాకిస్తాన్ కి అనుకూలించడమే. అయితే అభిమానులు మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతున్నా భరత్ లో జరుగుతున్నాయా అన్న చందంగా ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాట్లను పూర్తి చేసారు.  బిగ్ స్క్రీన్స్  ప్రొజెక్టర్లతో ప్రత్యేకంగా స్క్రీనింగ్స్‌ని నిర్వహిస్తూ ఉండడం తో పబ్స్ , మాల్స్ , బార్ లు అభిమానుల విజిల్స్ , కేకలతో హోరెత్తనున్నాయి. అభిమానుల కొరకు ఫుడ్ అండ్ డ్రింక్స్ ఏర్పాట్లు చేసారు , వారికొరకు ప్రత్యేకమైన ఆఫర్లను కూడా పెట్టారు. ఫుడ్ డెలివరీ యాప్ లు సైతం బంపర్ ఆఫర్లను ప్రకటించాయి . ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో భారత అభిమానుల రచ్చ కొనసాగుతువుంది. సోషల్ మీడియాలో ఎక్కడ  చూసినా తమ అభిమాన క్రికెటర్ల   పోస్టులతో హోరెత్తి పోతున్నాయి . దాయాది పాకిస్తాన్ జట్టు భరత్ తో ఎన్ని సార్లు పోటీ పడినా చివరకు భరత్ అనూహ్యంగా గెలుస్తూ వచ్చింది. ప్రపంచ కప్పు మ్యాచుల్లో భరత్ ఓడిన దాఖలాలు ఇప్పటివరకు లేవు.

అయితే ఆదివారం జరిగే మ్యాచ్ కచ్చితంగా గెలవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. శనివారం నుంచే దేశం లోని పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగ ఆరతి సమయంలో భారత జట్టుకు అభిమానులంతా పూలమాలలు వేసి ప్రార్ధించారు. కర్ణాటక అభిమానులు తమ ఇళ్లల్లో ప్రత్యేక పూజలు చేసారు. "వి విల్ విన్ టీ20 ప్రపంచకప్‌ 2021 " అను బ్యానరును పెట్టి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో గురించి నెట్టింట రచమొదలయ్యింది. అయితే ఇప్పటికే భరత్ రెండు వార్మప్ మ్యాచ్ లను గెలిచింది. రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.



 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: