టీ 20 వరల్డ్ కప్: పాకిస్తాన్ ను ఢీ కొట్టే జట్టిదే?

VAMSI
ప్రస్తుతం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అంతా యూఏఈ మరియు ఒమన్ లు వేదికలుగా జరుగుతున్న వరల్డ్ కప్ మీదనే దృష్టిని కేంద్రీకరించారు. ఇంకా మెయిన్ మ్యాచ్ లు స్టార్ట్ కాలేదు. క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఆదివారం ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఎప్పుడైనా ప్రపంచ కప్ లో దాయాదుల మధ్య పోరు అంటే అన్ని దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ కి ఇండియా తో రికార్డు చాలా పేలవంగా ఉంది. అయితే ఈ సారి ఎలాగైనా రికార్డును తిరిగి రాయాలన్న కసితో పాకిస్తాన్ టీం ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ టీం అల్ రౌండర్ లతో పటిష్టంగానే ఉంది.
పాకిస్తాన్ ను ఎదుర్కొని విజయం సాధించడానికి ఇండియా టీం ఎటువంటి జట్టుతో బరిలోకి దిగనుంది అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.
* ప్రస్తుతం ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేసిన టీమ్ లో ఉన్న ఆటగాళ్లు అందరూ ప్రతిభావంతులే. అయితే తమదైన రోజున చెలరేగి అడగలరు.
* ఓపెనర్లలో ఒకరైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఫామ్ లో లేకపోవడం కలవరపరిచే అంశం. అయితే ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న వార్మప్ మ్యాచ్ లో ఆడి ఫామ్ లోకి వస్తాడని ఆశిద్దాం.
* ఈ టీం లో ఆల్ రౌండర్ కోటాలో జట్టులోకి ఎంపికయిన హార్దిక్ పాండ్యా గురించి ప్రముఖంబుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీ లేకపోవడం మరియు బౌలింగ్ అసలు చేయకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. అంతేకాక తుది జట్టులో చోటు  ఇవ్వడం పై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
* బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ మొదటి వార్మప్ మ్యాచ్ లో వికెట్ తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అందుకే ఇతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా అశ్విన్ స్థానంలో రాహుల్ చాహర్ ను తీసుకోవచ్చు.
ఇండియా టీం: రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, షమీ, బుమ్రా, చాహర్
ఈ టీం తో పాకిస్తాన్ తో తలపడనుంది. మరి విజయాల రికార్డును మెరుగుపరుచుకుంటుందా అన్నది తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడక తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: