టీ 20 వరల్డ్ కప్: ఇండియా కప్ కొట్టగలదా... బలాబలాలివే?

VAMSI
ఎన్నో ప్రతికూలతల నడుమ టీ 20 ప్రపంచ కప్ యూఏఈ మరియు ఒమన్ లు వేదికలుగా షెడ్యూల్ చేయబడ్డాయి. మొదటగా సూపర్ 12 కు అర్హత సాధించడానికి క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే ఈ లోపు మెయిన్ మ్యాచ్ లు జరగడానికి ముందు వరుసగా వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న ఇండియా మరియు ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయ దుందుభి మోగించింది. అయితే సోషల్ మీడియాలో ఈ గెలుపుపై కూడా సెటైర్లు వేస్తున్నారు కొందరు. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కావడం వల్లనే ఫ్రీగా ఆడారు, నార్మల్ మ్యాచ్ అయి ఉంటే ఒత్తిడిలో ఏ విధంగా ఆడేవారో తెలుస్తుంది అంటూ రకరకాలుగా అంటున్నారు. అయితే వారి మాటలను పట్టించుకోకపోయినా నిజంగా ఈ ప్రపంచ కప్ నెగ్గగలదా అని మనము మనము ప్రశ్నించుకుంటే మన సమాధానం ఏమిటి అన్నది చూద్దాం.
ప్రస్తుతం టీం ఇండియా రాహుల్ మరియు రోహిత్ ల రూపంలో ఓపెనింగ్ పెయిర్ ఉంది. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో రోహిత్ బ్యాటింగ్ లో తీవ్రంగా విఫలమయ్యాడు. కాబట్టి ఏ మేరకు రాణిస్తాడు అన్నది సందేహమే. ఒకసారి ఊపందుకున్నది అంటే రోహిత్ ను ఆపడం ఎవరితరం కాదు. ఇక రాహుల్ నిన్న జరిగిన మ్యాచ్ లో అర్ద సెంచరీతో ఆకట్టుకోవడం ఒక ప్లస్ అయితే, వేగంగా పరుగులు రాబట్టడం మరో ప్లస్. కాబట్టి రాహుల్ ఫామ్ ఇండియాకు కలిసొచ్చే అంశమే. మూడవ స్థానంలో కోహ్లీ ఎలాగు ఉన్నాడు. అత్యవసరమయిన పరిస్థితుల్లో తానా బ్యాట్ నుండి విలువైన పరుగులను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాలుగు అయిదు స్థానాల్లో రిషబ్ పంబత్ మరియు సూర్యకుమార్ యాదవ్ లు ఆకట్టుకోగలరు.
6, 7 వస్థానాల్లో హార్దిక్ మరియు జడేజా ల రూపంలో అల్ రౌండర్ లు ఉన్నారు. వీరిద్దరిలో జడేజా గురించి ఎటువంటి సందేహం లేదు. కానీ హార్దిక్ పాండ్యా అల్ రౌండర్ లా లేడు. ఎందుకంటే ఐపీఎల్ నుండి నిన్న జరిగిన వార్మప్ మ్యాచ్ వరకు బౌలింగ్ చేసింది లేదు. కాబట్టి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్సమన్ గానే చూడాల్సి ఉంది. అశ్విన్ స్పిన్ మరియు బ్యాటింగ్ తో ఆకట్టుకోగలడు. బుమ్రా, షమీ మరియు భువనేశ్వర్ ల రూపంలో నాణ్యమైన మ్యాచ్ విన్నర్ లు జట్టులో ఉన్నారు. వీరంతా అనుకున్నట్లు ఆడితే ఎటువంటి పొరపాట్లు చేయకుండా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మ్యాచ్ ఫైనల్ అని మనసులో అనుకుని ఆడితే ఖచ్చితంగా ఈ సారి టీ 20 వరల్డ్ కప్ మనదే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: