బ్రేకింగ్: భారత క్రికెట్ కొత్త కోచ్‌గా ద్రవిడ్ గ్రీన్‌సిగ్నల్.. ఒక్క కండీషన్
ముందుగా పలువురు విదేశీ ఆటగాళ్ల పేర్లు కూడా పరి శీలనకు వచ్చాయి. పలువురు దరఖాస్తు చేసుకోవడంతో భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా ఎవరు ? వస్తారన్నది ఆసక్తి గా మారింది. అయితే బీసీసీఐ మాత్రం ద్రవిడ్‌కే ఓటేసింది. ఇక ద్రవిడ్ తో బీసీసీఐ కాంట్రాక్టు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇందుకు గాను ద్రవిడ్‌కు యేడాదికి రు. 10 కోట్ల చొప్పున రెండేళ్లకు గాను రు. 20 కోట్లు చెల్లించ నున్నారట. ఇక త్వరలోనే టీ 20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ పొట్టి ప్రపంచ కప్ ముగిసిన వెంటనే తాను కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ద్రవిడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ద్రవిడ్ కోచ్ గా ఉండగానే మనం టీం పలు కీలక టోర్నీలు ఆడనుంది.
వచ్చే 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీ కూడా ద్రవిడ్ ఆధ్వర్యంలోనే భారత జట్టు ఆడనుంది. ఇక ద్రవిడ్ కర్నాటక జట్టుకు చెందిన ఆటగాడు. రంజీల నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ద్రవిడ్ 1997లో ఇంగ్లండ్ లో పర్యటించిన భారత జట్టుతో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ గంగూలీ , ద్రవిడ్ కెరీర్ ఒకేసారి ప్రారంభమైంది. ఇక 2007 వన్డే ప్రపంచకప్ లో సైతం ద్రవిడ్ సారథ్యంలోనే భారత్ ఆడింది.