నేడే క్వాలిఫైర్-2 : చెన్నైని ఢీకొట్టే దెవరు ?

Veldandi Saikiran
ఐపీఎల్ 2021 14వ సీజన్ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు, క్వాలిఫైయర్ వన్ , మరియు ఎలిమినేటర్ మ్యాచ్ లు పూర్తి కాగా... ఇవాళ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ జరిగిన క్వాలిఫై యర్ 2  మ్యాచ్ లో...  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరియు కోల్కత నైట్ రైడర్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది.  ఈ మ్యాచ్ షార్జా లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుండగా...  రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్ అభిమానులు చాలా ఉత్కంఠతో... ఈ మ్యాచ్ కోసం చూస్తున్నారు. 

ఈ రెండు జట్ల లో... ఫైనల్ కు ఏ జట్టు వెళుతుంది అనే టెన్షన్... అందరిలోనూ నెలకొంది. ఇంకా వరుసగా ఐపీఎల్ 14 వ సీజన్ లో ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కేకేఆర్ జట్లకు ఇదే చివరి అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై... పోటీ పడేందుకు ఇవాళ తలపడనున్నాయి రెండు జట్లూ.  ఇక జట్ల బలాబలాల విషయానికి వస్తే... లీగ్  చివరి  స్టేజ్... మ్యాచు లతోపాటు ఎలిమినేటర్ మ్యాచ్ లోనూ... కోల్కత నైట్ రైడర్స్ జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. మొన్న జరిగిన ఎలిమినేటర్ మొదటి మ్యాచ్ లో... అందరూ ఆటగాళ్లు చక్కటి  ఆటతీరును... కనబరిచి..  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై విజయం సాధించారు. ఇక అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా మంచి ఊపు లో కనిపిస్తోంది.

ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీ సాధించని ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎలాగైనా టైటిల్ ను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో శిఖర్ ధావన్ , పృథ్వీ షా, రిషబ్ పంత్ మరియు శ్రేయస్ అయ్యర్ కాస్త టచ్ లోకి వస్తే.... ఇవాళ జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా విజయం సాధిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిచి ఫైనల్ కు వెళితే... చెన్నై సూపర్ కింగ్స్ ను ఈనెల 15 వ తేదీన  ఢీ కొట్టనుంది. అయితే  ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్... ఫైనల్ కు చేరితే... చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: