ధోని vs పంత్.. పంతం నీదా నాదా సై?
ఓవైపు కెప్టెన్గా ఇప్పటికే తన సామర్థ్యం ఏమిటో చూపించి అటు భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు ధోని.. అటు ఐపీఎల్ చరిత్రలో కూడా ఎంతో సక్సెస్ఫుల్ కెప్టెన్గా మూడు సార్లు టైటిల్ గెలిచిన సారధిగా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక మరోవైపు భారత క్రికెట్లో ధోని వారసుడు అంటూ పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ తన జట్టు అయినా ఢిల్లీ క్యాపిటల్స్ కి టైటిల్ అందించేందుకు ఎంతో కసితో ఉన్నాడు. తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకుని ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు టైటిల్ అందించాలని సిద్ధమవుతున్నాడు. కాగా ఈ రెండు జట్ల మధ్య నేడు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్స్ జరగబోతుంది.
దీంతో నేడు జరగబోయే క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే నేడు జరిగే క్వాలిఫైయార్ మ్యాచ్లో గెలిచే జుట్టు డైరెక్టుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గెలిచిన జట్టు తో మరోసారి మ్యాచ్ ఆడి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.2021 సీజన్లో లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఢిల్లీ గెలిచింది. అలా అని ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా ఉన్న సీఎస్కే ను తక్కువ అంచనా వేయడానికి లేదు. దీంతో నేడు జరగబోయే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ధోనీ రాణిస్తాడా ధోని వారసుడు సత్తా చాటుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.