ఐపీఎల్ పై మళ్ళీ నీలినీడలు ?

VAMSI
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కున్న అభిమానుల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఎక్కడ మ్యాచ్  జరిగినా అభిమానుల సంతోషానికి హద్దులే ఉండవు. విదేశాల్లో జరిగే అన్ని దేశవాళీ లీగ్ ల కన్నా ఇండియాలో  జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కి ఉండ్ ఆదరణ వేరే. ఎంతో మంది ఆటగాళ్లు ఐపిఎల్ లో ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 13 సీజన్ లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం ఎంతో అట్టహాసంగా 14 వ సీజన్ ప్రారంభం అయింది. అయితే 29 మ్యాచ్ లు మాత్రం సజావుగానే సాగాయి.  కానీ అనూహ్యంగా ఐపిఎల్ ప్లేయర్ కు కరోనా సోకడంతో బీసీసీఐ ఆందోళనకు గురయింది. ఆ తర్వాత కేసులు పెరుగుతూ ఉండడంతో తర్వాత జరగాల్సిన మ్యాచ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. 

అయితే దీని వలన ప్రేక్షకులు మాత్రం చాలా నిరాశకు గురయ్యారు. ఐపిఎల్ జరుగుతుందా అనే అనుమానాలు కమ్ముకున్నాయి. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ సంవత్సరం ఐపిఎల్ ను రద్దు చేయాలని బీసీసీసి పై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఐపిఎల్ రద్దు అయితే వచ్చే నష్టం గురించి బీసీసీఐ కి తెలుసు. కాబట్టి వెనకడుగు వేయలేకపోయింది. అయితే కొన్ని చర్చల అనంతరం యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచ్ లను జరిగేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే అనుకున్న విధంగా 19 సెప్టెంబర్ నుండి చెన్నై మరియు ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో ఐపిఎల్  14 సీజన్ సెకండ్ లెగ్ స్టార్ట్ అయింది.

ఈ రోజు వరకు నాలుగు మ్యాచ్ లు జరిగాయి.  కానీ ఇవాళ మధ్యాహ్నమే వచ్చిన పిడుగులాంటి వార్త ఐపిఎల్ అభిమానుల ఆశలను చిధిమేసెలా  ఉంది. సన్ రైజర్స్ ఆటగాడు త్యాగరాజ నటరాజన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నటరాజన్ కాకుండా మరో పది మంది సిబ్బంది కూడా సెల్ఫ్ ఇసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఐపిఎల్ 14 సీజన్ అసలు జరుగుతుందా లేదా అర్ధాంతరంగా రద్దు అవుతుందా అనే ఆలోచనలో పడ్డారు. మరి వైపు బీసీసీఐ కూడా సందిగ్ధంలో పడింది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: