రవి శాస్త్రికి ధోని ఝలక్.. ఎందుకో తెలుసా?

praveen
ప్రస్తుతం రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అనిల్ కుంబ్లే తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టిన రవిశాస్త్రి గత కొన్నేళ్ల నుంచి ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇటీవలె టి20 వరల్డ్ కప్ కోసం అటు భారత క్రికెట్ లో దిగ్గజ కెప్టెన్ గా ఉన్న మహేంద్రసింగ్ ధోని టీమిండియాకు మెంటార్ గా నియమించింది బీసీసీఐ.  ఇకపోతే  మహేంద్రసింగ్ ధోని టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి కి ఝలక్ ఇచ్చాడు.  అదేంటి వీరిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అని షాక్ అవుతున్నారు కదా.

 వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. రవిశాస్త్రి చేసిన పనికి ధోని ఇచ్చిన సమాచారం రవిశాస్త్రిని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది  అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు ధోనీ కెప్టెన్సీలో  టీమిండియా 2007లో టి20 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో.  భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను మహేంద్ర సింగ్ ధోనీ తన అద్భుతమైన కెప్టెన్సీలో టీమిండియాకు అందించాడు. దీంతో అటు భారత క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 2007లో ఇదే రోజు టి20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును టీమిండియా ఓడించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే మ్యాచ్ కు ముందు ఏం జరిగింది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు ఈ సెమీస్ లో ఆస్ట్రేలియానే నా ఫేవరెట్ జట్టు అంటూ రవి శాస్త్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇక సెమీస్ లో ఆస్ట్రేలియాఫై టీమిండియా విజయఢంకా మోగించిన అనంతరం కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ   మ్యాచ్ కీ ముందు మీ స్టేట్మెంట్ చదివాను మీరు ఆస్ట్రేలియా ఫేవరెట్ అని అన్నారు కానీ మీరు చెప్పింది తప్పు అని మీరు నిరూపించాం అంటూ ధోనీ సమాధానం చెప్పాడట దీంతో రవిశాస్త్రి షాక్ అయ్యాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: