రైనా స్కూల్ క్రికెటర్లా కనిపించాడు : డెల్ స్టెయిన్

praveen
ఒకప్పుడు భారత జట్టులో ఎంతో అద్భుతంగా రాణించిన సురేష్ రైనా ఆ తర్వాత మాత్రం తుది జట్టు అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే తన అంతర్జాతీయ కెరీర్ కు సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.  అయితే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఎప్పుడు ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తు జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు సురేష్ రైనా.  జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తన బ్యాటింగ్ తో ఆదుకుంటూనే ఉంటాడు.

 అంతేకాదు ఐపీఎల్ లో సురేష్ రైనాకు మంచి రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో సార్లు పరుగుల వరద పారించాడు సురేష్ రైనా. అయితే ఇటీవలే ఐపీఎల్ రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సురేష్ రైనా ఆట తీరు మాత్రం అభిమానులందరి అసంతృప్తి పరిచింది. భారీ అంచనాల మధ్య బ్యాటింగ్కు దిగిన సురేష్ రైనా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాగా ఆడాల్సింది పోయి ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. దీంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు.

 అయితే ఇటీవలే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సురేష్ రైనా ఆటతీరుపై స్పందించిన సౌత్ ఆఫ్రికా బౌలర్ డీయిల్ స్టేయిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు వచ్చిన సురేష్ రైనా నిర్లక్ష్యంగా ఆడి కేవలం నాలుగు పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ సమయంలో సురేష్ రైనా ఒక స్కూల్ క్రికెటర్ల కనిపించాడు. అంతర్జాతీయ ఆటగాడు అయిన రైనా తీరు నేను నమ్మలేకపోయాను. బ్యాట్ విరిగిపోయి వికెట్ కోల్పోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ తెలిపాడు డేయిల్ స్టేయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: