ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణం అదే : ఇంగ్లాండ్ క్రికెటర్

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశియా క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి అటు విదేశీ క్రికెటర్లు ఎంత ఆసక్తి చూపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటం వల్ల ఒక వైపు భారీగా ఆదాయం రావడంతో పాటు మరోవైపు ఇక ఎన్నో అనుభవాలను కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తూ ఉంటారు విదేశీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.  ఇలా ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దాదాపు చాలా దేశాల జట్లను నుంచి ఆటగాళ్లు ఆడుతున్నారు.

 కానీ ఇటీవలే కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడదానికి వెనకడుగు వేస్తున్నారు. కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ ఆడలేము అంటూ ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు మొదటి దశ ఐపీఎల్ లో ఆడిన ఆట గాళ్లు ఇక ఇప్పుడు రెండవ దశ నుంచి మాత్రం తప్పుకుంటున్నట్లు ప్రకటించి జట్టు యాజమాన్యాలకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా అటు ఐపీఎల్ రెండవ దశకు తాను అందుబాటులో ఉండటం లేదు అంటూ ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ ప్రకటించి షాకిచ్చాడు.

 ఇటీవలే తాను ఐపీఎల్ నుంచి తప్పుకోవడం పై స్పందించిన క్రిస్ వొక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు  టి20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ లు సమీపంలో ఉండటం కారణంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండవ దశ కు అందుబాటులో లేక పోతున్నాను అంటూ క్రిస్ వొక్స్ చెప్పుకొచ్చాడు. టి20 వరల్డ్ కప్ ఆడే జట్టులో నేను కూడా ఉన్నాను. వరల్డ్ కప్ తర్వాత యాషెస్ సిరీస్ కూడా ఉన్నాయి. దీని కోసం వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం. ఇంకా వీటి కోసం సిద్ధం కావడానికి  తక్కువ సమయం ఉండడం తోనే ఐపీఎల్ నుంచి తప్పుకున్న అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: