తండ్రి కాబోతున్న సీఎస్ కే ప్లేయర్ !

Veldandi Saikiran
భారత జట్టు కీలక ఆటగాడు కృష్ణప్ప గౌతమ్.. తండ్రి కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ శుభవార్త ను సోషల్ మీడియా వేదికగా స్వయంగా టీమిండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ స్పష్టం చేశారు. తన బిడ్డ రాక కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని  తెలిపాడు క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్. " నా జీవితంలో ఓ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నా. మా గుండెలు ఆనందంగా ఉండిపోయాయి. వచ్చే ఏడాది జనవరి మాసం లో చిన్నారి రాక... మా ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది" అంటూ ఈ టీమిండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ పేర్కొన్నారు. అంతేకాదు బేబీ పంపు తో ఉన్న తన భార్య అర్చన సుందర్ తో కలిసి దిగిన పిక్స్ షేర్ చేశాడు క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్. ఇక ఈ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు పెట్టేస్తున్నారు. కంగ్రాట్స్, సూపర్, అద్భుతం అంటూ ఎవరికి తోచిన కామెంట్లు వారు పెడుతున్నారు. ఇది ఇదిలా ఉండగా.... శ్రీలంక జట్టు తో ఈ సంవత్సరం జూలై మాసం లో జరిగిన వన్డే సిరీస్ తో... ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ కర్ణాటక ఆటగాడు కృష్ణప్ప గౌతమ్. అలాగే ప్రపంచంలోనే మెగా టోర్నీ అయిన ఐపిఎల్ లో   భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు కృష్ణప్ప గౌతమ్.

ఇక 2021 ఐపీఎల్ వేలం ఏకంగా 9 కోట్ల 25 లక్షలు వెచ్చించి ఈ కర్ణాటక క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ ఒంగోలు చేసిన సంగతి విదితమే. ఇక ఇప్పటి వరకు కృష్ణప్ప గౌతమ్... చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడనే లేదు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021  వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సెకండ్ పేజ్ ఈ నెల 19 వ తేదీ తిరిగి పున ప్రారంభం కానుంది. ఇండియాలో కరోనా విజృంభన నేపథ్యంలో ఈ మెగా టోర్నీని దుబాయిలో నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: