ఐపీఎల్ ఫై గబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ రెండో దశ ప్రారంభం కాబోతోంది. అయితే బిసిసిఐ అనుకున్న సమయానికి పక్కా ప్లాన్ ప్రకారం సమ్మర్ లో ఐపీఎల్ ప్రారంభించింది.  ఈ క్రమంలోనే అటు క్రికెట్ ప్రేక్షకులందరూ మురిసిపోయారు. అసలు సిసలైన క్రికెట్ మజాను పొందడానికి సిద్ధమైపోయారు. ఇక ఎంతో సవ్యంగానే సగానికి పైగా ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. కానీ అంతలో కరోనా వైరస్ బిసిసిఐకి షాక్ ఇచ్చింది. ఐపీఎల్ లో వివిధ జట్ల లోని ఆటగాళ్లు వరుసగా  వైరస్ బారిన పడడం సంచలనంగా మారిపోయింది.

 ఈ క్రమంలోనే ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం భారత్ లో కాకుండా యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండవ దశ నిర్వహించేందుకు సిద్ధమైంది బిసిసిఐ. సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఇక ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు కూడా యూఏఈ చేరుకొని ప్రస్తుతం క్వారంటైన్ పూర్తి చేసుకుంటున్నారు. అయితే అటు ఐపీఎల్లో ప్రస్తుతం  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఐపీఎల్ మొదటి దశలో కూడా వరుస విజయాలను నమోదు చేసింది.  ఇకపోతే రెండవ దశ ఐపీఎల్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడు అయిన శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 కరోనా వైరస్ కు ముందు ఐపిఎల్ పద్నాలుగవ సీజన్ లో ఎలా ఆడామో.. ఇక ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ లోనూ అలాగే రాణిస్తాం అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఐపీఎల్ ఆడటం ఎంతో బాగుంది.. ఇక అటు జట్టులో కూడా మంచి వాతావరణం నెలకొంది..  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లందరూ దుబాయ్ లో బాగా కష్ట పడుతున్నారు. ఇక ఐపీఎల్ పునః ప్రారంభం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దం గా ఉన్నాం.. విజయంతో  ఈ రెండవదశ ఐపీఎల్ ప్రారంభించాలని తమ జట్టు భావిస్తోంది అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: