ఆ ఒక్క మ్యాచ్.. ఇండియా ఆటగాళ్లకు రికార్డుల పంట !

Veldandi Saikiran
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ లో కోహ్లీసేన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ భారత్ 191 పరుగులు మాత్రమే చేయగా  290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఇంగ్లాండ్ జట్టు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ముందు 367 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్  జట్టు. లక్ష్య చేధనను మంచిగానే ఆరంభించిన  తర్వాత తడపడింది ఇంగ్లాండ్ జట్టు. దాంతో 210 పరుగులకే 10 వికెట్లు కోల్పోవడంతో  157 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది ఇండియా టీం. అయితే ఈ ఒక్క మ్యాచ్ లో  చాలా రికార్డులు నెలకొల్పారు భారత ఆటగాళ్లు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో అర్ధాష్టకం చేసిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 23000 పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా... ఐదవ అంతర్జాతీయ ఆటగాడిగా నిలిచాడు విరాట్.
ఈ విషయంలో సచిన్ (34,357), సంగర్కర(28,016), పాంటింగ్(27,483), ద్రావిడ్(24208) విరాట్ కంటే ముందే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కష్టాలో ఉన్న భారత్ ను ఆదుకున్నాడు శార్దుల్ ఠాకూర్. 36 బంతుల్లో 57 పరుగులు చేసాడు. ఈ క్రమంలో టెస్టులో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కేవలం 31 బంతుల్లోనే 50 పరుగులు చేసాడు శార్దుల్. అయితే ఇంగ్లాండ్ పై ఇదే ఓ భారతీయుడి అత్యంత వేగమైన అర్ధశతకం కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి.. అంతర్జాతీయ క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసుకున్నాడు  రోహిత్ శర్మ. రోహిత్ శర్మ భారత్ కు బయట చేసిన మొదటి టెస్ట్ సెంచరీ కూడా ఇదే కావడం గమనార్హం.
ఇదే సమయంలో టెస్టులో 3000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు హిట్ మ్యాన్ రోహిత్. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసి..  రెండో ఇన్నింగ్స్ లో కూడా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు  భారత పేసర్ బుమ్రా. అయితే ఈ రెండో ఇన్నింగ్స్ లో జానీ బెయిర్‌స్టో వికెట్ తీసి.. టెస్టులో 100 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు  బుమ్రా . ఈ ఘనతను బుమ్రా కేవలం 24 టెస్టులోనే సాధించాడు  బుమ్రా . అలాగే ఈ మ్యాచ్ లో మొత్తం 4 వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ కు వ్యతిరేకంగా మొత్తం 50 వికెట్లు, 500 పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు  భారత ఆల్ రౌండర్ జడేజా.  ఈ ఘనతను జడేజా కంటే ముందుగా వినూ మన్కడ్, కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్ సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: