భారత్ పవర్ హౌస్.. కోహ్లీ సూపర్ స్టార్?

praveen
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగానే.. కాదు ఒక అత్యుత్తమ కెప్టెన్గా కూడా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాను అగ్రస్థానంలో నిలపడం లో  విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి. జట్టు మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో జట్టుకు విజయం అందించిన రోజులు కూడా చాలానే ఉన్నాయి.  ఒక కెప్టెన్ కు కావలసిన అన్ని అర్హతలూ కూడా ప్రస్తుతం విరాట్ కోహ్లీ లో పుష్కలంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను చూస్తూనే మరోవైపు  ఇక జట్టులో కీలక ఆటగాడిగా ఎప్పుడూ అదిరిపోయే బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.

 కోహ్లీ ఆటతీరు ఎప్పుడు ప్రేక్షకులందరికీ ఫుల్ టైం క్రికెట్ మజా ని అందిస్తుంది. అయితే  కోహ్లీకి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం విరాట్ కోహ్లీ ఆటకు ఫిదా అవుతుంటారు. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆటతీరుపై స్పందిస్తూ ఏకంగా పొగడ్తలతో ముంచెత్తాడు. ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్వార్న్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. జట్టు ఆటగాళ్లు కెప్టెన్గా కోహ్లీ కోసమే మైదానంలో వెతుకుతూ ఉంటారూ.. ఇక అతని కోసమే ఆడతారు..  అంతలా విరాట్ కోహ్లీ జట్టులోని ఆటగాళ్లలో గౌరవాన్ని సంపాదించుకున్నాడు అంటూ షేన్ వార్న్ వ్యాఖ్యానించాడు.

 ఇక విరాట్ కోహ్లీ తన కెరియర్లో తనని తాను మలుచుకుంటున్న తీరు చూస్తుంటే.. మేమంతా థాంక్యూ చెప్పాల్సిందే. కోహ్లీకి టెస్టులు అంటే ఎంతో ఇష్టం ఇక క్రికెట్ ప్రపంచంలో భారత్ ఒక పవర్ హౌస్..  ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు ప్రపంచంలోనే ఒక సూపర్ స్టార్ అంటూ ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ విరాట్ కోహ్లీ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇకపోతే ప్రస్తుతం విరాట్ కోహ్లీ అటు టీమ్ ఇండియాను ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇటీవల నాలుగో టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు విజయం సాధించి ఏకంగా ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టుపై ఆధిపత్యాన్ని సాధించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: