తడబడుతున్న భారత్ !

Veldandi Saikiran
ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో... ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు దాటిగా ఆడుతుంది. మొదటి సెషన్ మొదట్లో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీయడంతో... ఇంగ్లాండ్ జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయవచ్చని అనుకున్నారు. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హోలీ పోప్ 86 పరుగులు, క్రిస్ వోక్స్ 50 పరుగులు చేసి ఇండియా జట్టును కష్టాల్లోకి నెట్టారు. దీంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు.. చివరికి 99 పరుగుల ఆధిక్యాన్ని రాబట్టగలిగింది. మ్యాచ్ మన జట్టు వైపు వస్తుందనుకుంటే... ఇంగ్లాండ్ వైపు ఆధిక్యాన్ని రాబట్టింది.
ఇక ఓవర్నైట్ స్కోర్ 53 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. 84 ఓవర్లలో 295 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు 99 పరుగుల ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలింగ్ విషయానికి వస్తే... ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు, బొమ్మ రెండు వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 1, సిరాజ్  రెండు వికెట్లు పడగొట్టాడు.  ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా చాలా దీటుగా ఆడుతోంది. రోహిత్ శర్మ 20 పరుగులు మరియు కె.ఎల్.రాహుల్ 22 పరుగులతో క్రీజ్లో కొనసాగుతున్నారు.
ఇక అంతకు ముందు టీమ్ ఇండియా జట్టు 191 పరుగులకే చాప చుట్టేసిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 50 పరుగులు మరియు శార్దూల్ ఠాకూర్ 57 పరుగులు చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోరు అందించగలిగారు. ఇక మిగితా టాపార్డర్ మరియు పూర్తిగా విఫలమైంది. టీమిండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చాలా దీటుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు రాబడితే తప్ప... ఇండియాకు విజయ అవకాశాలు ఉండకపోవచ్చును. కాగా ఐదు టెస్టుల సిరీస్ లో 1-1 తేడాతో సిరీస్ ను సమం చేసింది ఇంగ్లాండ్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: