టీమిండియాలో అతన్ని ఎప్పుడూ ఇలా చూడలేదు : నెహ్ర

praveen
చటేశ్వర్ పుజారా.. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. మొదట్లో టీమిండియాలో మూడు ఫార్మాట్లలో ఆడిన ఛటేశ్వర్ పూజారా ఇక ఆ తర్వాత మాత్రం కేవలం టెస్ట్ క్రికెట్ కు మాత్రమే పరిమితం అయ్యాడు అనే విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం  అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎంతో నెమ్మదైన ఆటకు  ఛటేశ్వర్ పూజారా కేరాఫ్ అడ్రస్.  టెస్టుల్లో బౌలర్ల ను ఇబ్బంది పెడుతూ వికెట్ కోల్పోకుండా ఎన్నోసార్లు భారత జట్టును గట్టెక్కించాడు చటేశ్వర్ పుజారా.  ఇక తనదైన ఆట శైలి తో టీమ్ ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్నాడు.

 అయితే గత కొంత కాలం నుంచి  పుజారా ఆట తీరు పేలవంగా ఉండడంతో  విమర్శలు వచ్చాయి. ఎక్కువ బంతులను వృధా చేస్తూ ఉండటం పరుగులు తీయడానికి ప్రయత్నించకపోవడం కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు పుజారా. ఎంతో నెమ్మదైన బ్యాటింగ్ కారణంగా మిగతా ఆటగాళ్లు పై ఒత్తిడి పెరిగిపోతుందని.. తద్వారా ఇక మిగతా ఆటగాళ్లు పరుగులు చేయాలి అనే తొందరలో వికెట్ చేజార్చుకున్న అని పలువురు మాజీ ఆటగాళ్లు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  కానీ ఇటీవల జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం చటేశ్వర్ పుజారా అద్భుతంగా ఆడాడు. ఒకానొక దశలో సెంచరీ చేస్తాడేమో అన్నట్లుగా కనిపించాడు.

 ఈ క్రమంలోనే ఇక పుజారా ఆటతీరుపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మూడోరోజు ఆట లో చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ తీరు పూర్తిగా భిన్నంగా  కనిపించింది అంటూ వ్యాఖ్యానించాడు. పూజరా ఇలా ఆడటం గతంలో నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా ఎంతో సానుకూలం గా కనిపిస్తు న్నాడు. అతను ఒత్తిడికి గురి కావడం లేదు అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరున్న చటేశ్వర్ పుజారా టెస్ట్ ల్లో ఇప్పుడు వరకు చెప్పుకోదగ్గ స్కోర్ మాత్రం చేయలేదు. కానీ ఇటీవల ఏకంగా సెంచరీ చేస్తాడు అనుకుంటే ఇక త్రుటిలో వికెట్ చేజార్చుకుని 90 పరుగులతో సరిపెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: