రెచ్చగొట్టిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సిరాజ్?

praveen
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టెస్టు సిరీస్ ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.  ఇకపోతే ఇప్పటికే టీమిండియా ఒక మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక  ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. అయితే మొదటి నుంచి అటు టీమిండియా ఆటగాళ్లకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం. ఏకంగా మైదానంలో ఉన్న ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా స్టేడియం లో ఉన్నా ఆడియన్స్ వ్యవహరిస్తున్నారు.  మైదానంలో ఉన్న ఆటగాళ్ల పైకి వివిధ రకాల వస్తువులు విసరడం లాంటివి కూడా చేస్తున్నారు.



 అదే సమయంలో అటు మైదానంలో క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరిగిపోతుంది. ఒకరిని ఒకరు  కవ్వించుకుంటున్నారు.  దీంతో ప్రస్తుతం ఇండియా.. ఇంగ్లాండ్ కి  మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ ఎంతో హాట్ హాట్ గా మారిపోయింది.  ముఖ్యంగా భారత క్రికెటర్లకు ఇంగ్లాండ్ అభిమానులు అంతకంతకూ రెచ్చగొడుతూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇటీవలే బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా బౌలర్ సిరాజ్ ఫై ప్రేక్షకులు ఏకంగా ఒక బాల్ విసిరేశారు అని  రిషబ్ పంత్ ఇక మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.



 ఈ ఘటనపై అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక అంతటితో ఆగకుండా స్టేడియం లో ఉన్న ఇంగ్లాండ్ ప్రేక్షకులు అందరూ కూడా రెచ్చగొట్టే విధంగా అరుస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ను ఉద్దేశిస్తూ ఇక స్టేడియం లో ఉన్న ఇంగ్లాండ్ అభిమానులు చేసిన కామెంట్స్ కి మహమ్మద్ సిరాజ్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. స్కోర్ ఎంత అంటూ సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్న దగ్గర స్టేడియం నుంచి ఇంగ్లాండ్ అభిమానులు అరవడం మొదలు పెట్టారు   దీంతో అటు వైపు తిరిగి 1-0 అంటూ చేతులతో చూపించి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: