రోహిత్ శర్మ మారిపోయాడు : సచిన్

praveen
టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఎంతో నిలకడగా రాణిస్తున్నాడు. అయితే ఎప్పుడూ దూకుడుగా ఆడే రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో  ఆచితూచి ఆడుతూ జట్టు కోసం ఇక పరుగులు చేస్తున్నాడు.  ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా నిలకడగా రాణిస్తున్న రోహిత్ శర్మ ఆటపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


 తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో సరికొత్త రోహిత్ శర్మను చూస్తున్నాను అంటూ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా హిట్ మ్యాన్ తన ఆటను మరో స్థాయికి తీసుకువెళ్ళాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. బంతులను వదిలేయడం డిఫెండ్ చేయడంలో ప్రస్తుతం రోహిత్ శర్మ ఎంతో పట్టు సాధించినట్లు కనిపిస్తున్నాడని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు చూస్తే ఇక జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తన భుజాల పైన వేసుకున్నట్లు కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.


 ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ తొందరపడకుండా పరిస్థితులకు తగినట్లుగానే తన ఆటను మార్చుకుంటున్నాడూ అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. ఇలా  తన బ్యాటింగ్తో తన లోని మరో కోణాన్ని కూడా రోహిత్ శర్మ చూపించాడు అంటూ చెప్పాడు మాస్టర్ బ్లాస్టర్. అదే సమయంలో ఇక హిట్ మాన్ పులి షాట్ల బలహీనతతో అవుట్ అయిన విధానంపై కూడా స్పందించాడు. అతను అవుటైనది కాకుండా జుట్టుకు ఏం చేశాడనే విషయాన్ని గమనించాను అంటూ వ్యాఖ్యానించారు ఇక ప్రస్తుతం రోహిత్ లో సహనం కూడా ఎంత బాగా పెరిగిందని.. ఎంతో ఓపికతో ఆడుతున్నాడు అంటూ సచిన్ టెండూల్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: