గుడ్ న్యూస్.. ఐపీఎల్ లో వాళ్లు కూడా జాయిన్ అవుతున్నారు?

praveen
మళ్లీ క్రికెట్ ప్రేక్షకులందరూ సిద్ధమైపోతున్నారు. ఎందుకు అంటారా..  అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించె ఐపీఎల్ మరోసారి ప్రారంభం కాబోతుంది. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే సగం పూర్తయిన ఐపీఎల్లో ఇక ఈ సారి రెండవ దశలో ఎవరు బాగా రాణించి టైటిల్  చేజిక్కించుకుంటారూ అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.


 అయితే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక ముఖ్యంగా వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఇక ఆయా దేశాల తరపున క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. ఇలాంటి సమయంలో ఐపీఎల్ కి ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు దూరం అవుతారు అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కేన్ విలియమ్సన్ కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. ఇటీవల జట్టు బాధ్యలను కూడా స్వీకరించి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కేన్ విలియమ్సన్ ఇక రెండవ దశ ఐపీఎల్లో  ఎంట్రీ ఇస్తాడా లేదా అన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి.



 ఈ క్రమంలోనే ఇక కివీస్ ఆటగాళ్ల ఐపీఎల్ లీగ్ లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కేన్ విలియమ్సన్ జాయిన్ అవుతాడు. ఇక ఆ తర్వాత ముంబై జట్టులో బౌల్ట్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు జెమిసన్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోకి శాన్ట్నర్ అందుబాటులోకి రానున్నారూ. వాస్తవంగా అయితే ఐపీఎల్ జరిగే సమయంలోనే అటు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. కానీ ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్ళకు విశ్రాంతి  ఇస్తున్నట్లు ఇటీవలే కివీస్  క్రికెట్ బోర్డు ప్రకటించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: