ద‌టీజ్ సింధూ : ఎవ్వ‌ర్నీ నిందించ‌లే!

RATNA KISHORE

ద‌టీజ్ సింధూ : ఎవ్వ‌ర్నీ నిందించ‌లే!




వివాదాలు లేని చోటు

త‌నకంటూ ఓ పంథా

అల‌వ‌ర్చుకుంటూ

చేసిన ప్ర‌యాణం

ఇన్నేళ్లు.. మైదానంలో




కోర్టుకు అవ‌త‌ల

ఆమేం మాట్లాడ‌రు

మాట్లాడినా అంతా సానుకూల‌మే

వివాదాలూ రాజకీయాలూ ఆమెకు ప‌డ‌వు




మాట‌లేవ‌యినా స‌రే

ఇత‌రుల‌ను నొప్పించ‌వు

మ‌ట‌లేవ‌యినా స‌రే

గౌర‌వం రెట్టింపు చేస్తాయి

ఇవీ సింధూ ప్ర‌త్యేక‌త‌లు





చాలామంది క్రీడాకారిణులు ఆమెను చూసి నేర్చుకోవాలి. ఈ మాట ఆమెకు మాత్ర‌మే వ‌ర్తింపు. గుత్తా జ్వాలా లాంటి క్రీడాకారిణు లు మాట్లాడే మాట‌లు, సానియా లాంటి వారు ట్విట‌ర్ వేదిక‌గా మాట్లాడే మాట‌లు వేరు వేరు కానీ వీటికి అతీతం సింధూ. కెరియ‌ర్ లో వివాదాలు లేవు.. త‌న ప‌నేదో తాను.. ఇంత వ‌ర‌కూ కోచ్ ను నిందించింది లేదు.. తిట్టింది లేదు.. త‌నకు ఫ‌లానా సౌక‌ర్యాలు అంద‌డం లేద‌ని అరిచిన రోజులూ లేవు. ఇప్పుడు  విశాఖ కేంద్రంగా ఆమె అకాడ‌మీ ప్రారంభించ‌బోతున్నారు.




ఇందుకు సంబంధించి ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ రెండు ఎక‌రాల స్థ‌లం సైతం కేటాయించింది. ఈ అకాడ‌మీ ప‌నులు కూడా త్వ‌రలో పూర్త‌యి ఆమెకు మంచి పేరు తీసుకు రావాల‌ని ఆశిద్దాం. ముఖ్యంగా ఇవాళ త‌న విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కోచ్ గురించి ఆయ‌న క‌ష్టం గురించి కూడా చెప్పాలి. పార్క్ తే సంగ్.. ఇప్ప‌టి సింధూ విజ‌యంలో వాటా అందుకున్న కోచ్.. ఆయ‌న ఆమెకు గ‌డిచిన మూడేళ్లుగా శిక్ష‌ణ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆమె లోపాల‌ను దిద్ద‌డంలో, ఆట‌లో త‌రుచూ చేసే త‌ప్పులు దిద్ద‌డంలో ఆయ‌న వెన్నంటే న‌డుస్తున్నారు. గ‌చ్చిబౌలీ స్టేడియంలో ఆమెకు శిక్ష‌ణ ఇచ్చి ఆమె సానుకూల ధోర‌ణిని మ‌రింత పెంచారాయ‌న.





ముఖ్యంగా క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ప్రాక్టీసు కార‌ణంగా వ‌చ్చిన ఇబ్బందులూ అధిగ‌మించేలా చేశారాయ‌న. ఇలాంటి కోచ్ ల స‌హకారం సింధూ ముందు నుంచి పొంది ఉంది. గోపీచంద్ అకాడ‌మీలో త‌ర్ఫీదు పొందిన‌ప్పుడు కూడా ఆమె ఎంతో నిబద్ధ‌త‌తోనే ఉన్నారు. ముఖ్యంగా ఆమె ల‌క్ష‌ణం ఆరోప‌ణ‌లు చేయ‌క‌పోవ‌డం. దేశం త‌ర‌ఫున ఆడు తున్నాన‌న్న స్పృహ లెక్క‌కు మిక్కిలి ఉండ‌డం.. వీటితో పాటూ త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం. ఇవే ఆమెకు అద‌న‌పు బ‌లాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: