బికినీ వేసుకోలేదని..1.3 లక్షల ఫైన్?
ఇక టెన్నిస్ ఆడే క్రీడాకారులను మాత్రం చిన్న చిన్న స్కర్ట్ వేసుకోవడం లాంటి చూస్తూ ఉంటామ్. ఇక కొన్ని కొన్ని క్రీడల్లో ఏకంగా బికినీలు వేసుకుని పాల్గొంటూ వుంటారు చాలామంది. అయితే ప్రతి క్రీడకి డ్రెస్ కోడ్ ఎంత ముఖ్యం అనే విషయానికి ఇటీవల జరిగిన ఘటన నిదర్శనంగా మారిపోయింది. డ్రెస్ కోడ్ పాటించలేదు అన్న కారణంతో ఏకంగా ఆ జట్టుకి 1.3 లక్షల జరిమానా విధించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన ఆటలలో హ్యాండ్బాల్ కూడా ఒకటి. ఎంతోమంది సరదాగా హ్యాండ్బాల్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇటీవలే మహిళల జట్ల మధ్య హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయ్. ఒక మహిళ జట్టుకు సరైన డ్రెస్ కోడ్ కూడా పాటించలేదు అనే కారణంతో జట్టుకు 1.3 లక్షల జరిమానా విధించారు.
ఇటీవలే బల్గేరియా లోని బీచ్ లో హ్యాండ్బాల్ పోటీ జరిగింది ఇక ఈ హ్యాండ్ బాల్ పోటీలలో నార్వే మహిళా జట్టు కూడా పాల్గొంది. అయితే ఇక ఈ హ్యాండ్ బాల్ పోటీలు ఆ జట్టు బికినీ వేసుకోలేదు అన్న కారణంతో ఏకంగా యూరోపియన్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ భారీ జరిమానా విధించి జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. నార్వేకు చెందిన మహిళా జట్టు బికినీ కి బదులుగా షార్ట్ వేసుకుని పోటీలలో పాల్గొంది. కానీ మ్యాచ్ నిబంధన ప్రకారం జట్టులోని మహిళలు అందరూ కూడా బికినీ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు షర్ట్ వేసుకుని నిబంధనలు ఉల్లంఘించినట్టు అయ్యింది. దీనికిగాను 1500 యూరోలు భారత కరెన్సీలో 1.3 లక్షల జరిమానా విధించింది యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్.