కోహ్లీని వెనక్కి నెట్టిన పాకిస్తాన్ కెప్టెన్.. రేర్ రికార్డ్?
అందుకే అభిమానులందరూ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు, పరుగుల యంత్రం అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ విరాట్ కోహ్లితో పాటు డేవిడ్ వార్నర్ ని కూడా వెనక్కి నెట్టి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంత అద్భుతంగా రాణిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాబర్ అజామ్ కెప్టెన్గా ఎలా ఉన్నా ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉంటాడు. ఇటీవలే అతి తక్కువ ఇన్నింగ్స్ లో 14 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఇప్పుడు వరకు వేగంగా 14 సెంచరీ పూర్తిచేసిన విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాళ్లను సైతం వెనక్కి నెట్టేశాడు. ఇటీవలే పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ తో మ్యాచ్ ఆడుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించిన బాబర్ అజామ్ సెంచరీతో అదరగొట్టాడు ఇక ఈ సెంచరీతో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా 14 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసి తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ సౌత్ ఆఫ్రికా ఆటగాడైనా హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. 84 ఇన్నింగ్స్ లో 14 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 98 ఇన్నింగ్స్ లో 14 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 102 ఇన్నింగ్స్ లో 14 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. కాగా ఇటీవలే ఒక్క సెంచరీతో అరుదైన రికార్డు సాధించాడు పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన బాబర్ అజామ్.