అరిపించాడు: ఇండియాలో గల్లీ క్రికెట్ షేన్ వార్న్...?

praveen
ప్రస్తుతం భారత్లో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెట్ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు ప్రేక్షకులు.  అందుకే క్రికెట్ కు సంబంధించి ఏదైనా వార్త సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.  అయితే సాధారణంగా గల్లి క్రికెటర్లు కొన్ని కొన్ని సార్లు అటు ఇంటర్నేషనల్ క్రికెటర్ల స్టైల్ నీ అనుకరిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు.  అంతేకాదు ఇక గల్లీ క్రికెట్ లో కూడా అదిరిపోయే బ్యాటింగ్ తో అరుదైన షాట్స్ ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.

 ఇలా అప్పుడప్పుడు గల్లీ క్రికెట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.  ఇక గతంలో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ స్టైల్ ని కాపీ చేస్తూ ఒక ఒక బుడతడు బౌలింగ్ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేసింది. అప్ కమింగ్ జస్ప్రీత్ బుమ్రా అంటూ ఆ బుడతడినీ ఎంతగానో పొగిడేశారు నెటిజన్లు.  ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడ ఒక యువకుడి బౌలింగ్ యాక్షన్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ బౌలర్ అయిన షేన్ వార్న్ బౌలింగ్ స్టైల్ లాగానే ఇక ఈ యువకుడి బౌలింగ్ స్టైల్ కూడా ఉంది.

 ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో షేన్ వార్న్ తన స్పిన్ బౌలింగ్ మాయ చేసినట్లుగానే ఇక ఇప్పుడు గల్లీ క్రికెట్ లో ఇండియన్ షేన్ వార్న్ తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన బౌలింగ్ స్టైల్ చూసి ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇండియన్ షేన్ వార్న్  అదరగొట్టాడు అంటూ  ఎన్నో కామెంట్లు సైతం పెడుతున్నారు నెటిజన్లు.  ఇక ప్రస్తుతం ఇక్కడ ఒక యువకుడు అమెరికా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ తరహాలోనే లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్న వీడియో కాస్త ప్రస్తుతం నెట్లో తెగ హల్చల్ చేస్తోంది.  మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: