జడేజా ఇప్పుడు నెంబర్..1?
టెస్ట్ ఫార్మాట్, టీ20, వన్డే ఫార్మాట్ అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఓవైపు జట్టులో కీలక ఆటగాడిగా తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఇక అదే సమయంలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్ తో విరుచుకుపడి భారీ స్కోర్లు చేస్తున్నాడు.. ఇంకోవైపు ఇక ప్రత్యర్థికి సవాల్ విసురుతూ ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇలా అన్ని ఫార్మాట్లలో అన్ని విభాగాలలో కూడా రవీంద్ర జడేజా తనకు ఎవరూ సాటి లేరు అని నిరూపిస్తున్నాడు. టీమ్ ఇండియా లోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ గా ఎదిగాడు రవీంద్ర జడేజా.
మొన్నటివరకు టీమిండియాలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా ఉన్న రవీంద్ర జడేజా.. ఇక ఇప్పుడు అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా అవతరించాడు జడ్డు బాయ్. ఇటీవలే టెస్ట్ లకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇక ఈ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు రవీంద్ర జడేజా. ఇక 2 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న జెన్ హోల్డర్ ను వెనక్కి నెట్టేశాడు. ఇక ఆ తర్వాత బెన్ స్టోక్స్, అశ్విన్, షకీబ్ బుల్ హసన్ వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు.