కోహ్లీ దంపతుల్లో థర్డ్ వేవ్.. భయం మొదలైందా?
ఇక తమ పిల్లల విషయంలో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇటీవలే విరాట్ కోహ్లీ దంపతులు కూడా కరోనా కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు దంపతులు మాత్రమే ఉండేవారు కానీ ఇటీవలే వారి జీవితంలోకి వామిక అనే ఒక చిన్నారి కూతురు వచ్చింది. తమ కూతురి పట్ల విరాట్ కోహ్లీ,అనుష్క శర్మ దంపతులు ఇప్పటినుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ముంబై ఎయిర్ పోర్ట్ లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కనిపించారు.
జూన్ 18వ తేదీ నుంచి ఇంగ్లాండ్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అటు విరాట్ కోహ్లీ ఇక టీమిండియా తో కలిసి ఇంగ్లాండ్ బయలుదేరగా అటు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ ముంబై విమానాశ్రయంలో కనిపించిన అనుష్క తన కూతురు ని ఎత్తుకొని పూర్తిగా తన కూతురు ముఖం ఎవరికీ కనిపించకుండా కవర్ చేసింది అనుష్క. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తుంటే విరాట్ కోహ్లీ దంపతులు థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు పాటించటం మొదలు పెట్టారు అని అర్థమవుతుంది.