20 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదేరోజు.. సచిన్ అది సాధించాడు..?

praveen
భారత క్రికెట్ దేవుడు మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత్లో క్రికెట్ అంటే దానికి కేరాఫ్ అడ్రస్ సచిన్ టెండూల్కర్ గా మారి పోయాడు. అతి చిన్న వయసు లోనే భారత అంతర్జాతీయ క్రికెట్లో స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత ఎక్కడ కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే భారత క్రికెట్ లో ఎన్నో రోజుల పాటు సేవలందించిన సచిన్ టెండూల్కర్ ఇక ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పాడు.

 కేవలం భారత క్రికెట్ చరిత్ర లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్ చరిత్ర లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు లను నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.  అందుకే ప్రతి యువ ఆటగాడు కూడా సచిన్ టెండూల్కర్ ను ఆదర్శం గా తీసుకుంటాడు. అయితే భారత క్రికెట్లో ఎన్నో రికార్డు లను నెలకొల్పిన సచిన్ టెండూల్కర్ సరిగ్గా ఇదే రోజు ఒక అరుదైన ఘనత సాధించాడు.  సరిగ్గా ఇదే రోజు 20 ఏళ్ల క్రితం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

 అందుకే ఈ రోజు సచిన్ టెండూల్కర్ కు ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి.  అయితే కేవలం వన్డేల్లో 10,000 పరుగుల మైలు రాయిని అందు కోవడం కాదు ఈ గణత సాధించిన తొలి క్రికెటర్గా కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇండోర్ లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన చేసి ఏకంగా 139 పరుగులు చేసి ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ 259 వన్డే మ్యాచ్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: