మేము విదేశాలకు వెళ్తే అలా చెయ్యం : అక్షర్ పటేల్
అద్భుతమైన బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. అదే సమయంలో టీమిండియాలో కీలక ఆల్రౌండర్ గా ఉన్న అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో మైదానంలో పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరిస్తున్న వేళ భారత స్పిన్నర్లు రెచ్చిపోతున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు చేయగా తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు స్పిన్ బౌలింగ్ లో ఆడటానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే కేవలం కొన్ని ఓవర్ల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. చెపాక్ స్టేడియం లో ఉన్న పిచ్ పై ప్రస్తుతం ఇంగ్లండ్ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో దీనిపై స్పందించిన భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిచ్ గురించి కొంత మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాట్లాడుతున్నారని కానీ ఎక్కడ బంతులు ఎగసిపడి హెల్మెట్ లకు తాకేలా రావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇదే పిచ్ పై తాము కూడా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టాము అంటూ చెప్పుకొచ్చాడు అక్షర్ పటేల్. ఒకవేళ మేము విదేశాలకు వెళ్లినట్లు అయితే అక్కడ ఫేస్ పిచ్ లపై ఎవరికీ ఫిర్యాదు చేయబోము అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చేపాక్ స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది అంటూ తెలిపాడు అక్షర్ పటేల్.