క్రికెట్ ప్రేక్షకులు సిద్ధం కండి.. అనుమతి వచ్చేసింది..?
ఈ క్రమంలోనే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మార్గదర్శకాలను విడుదల చేస్తుందా అని క్రికెట్ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ ప్రేక్షకులను అనుమతి ఇచ్చే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో దీనిపై బిసిసిఐ ఎలా నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఇటీవల బీసీసీఐ తో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం కూడా కీలక నిర్ణయం తీసుకుని అభిమానులందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
చెన్నై లో జరగబోయే మొదటి టెస్ట్ కాకుండా ఇక మిగతా మూడు టెస్టులకు కూడా క్రికెట్ ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 13 నుంచి చిదంబరం స్టేడియంలో జరగబోయే రెండవ టెస్ట్ కోసం ఇక ఆ తర్వాత జరగబోయే 34 వ టెస్ట్ మ్యాచ్ల కోసం కూడా 50 శాతం వరకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతులు ఇచ్చేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం స్టేడియంకు చేరుకొని మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు.