కోహ్లీ.. రహానేకి కెప్టెన్సీ ఇచ్చి.. బ్యాటింగ్ పై దృష్టి పెట్టు..?
ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్లో అజింక్యా రహానే సారథ్యంలోని భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక విరాట్ కోహ్లీ లేకపోయినప్పటికీ అజింక్య రహానే యువ ఆటగాళ్లతో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను రహానే కి అప్పగించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వన్డే, టి20కి పరిమితం చేయాలని డిమాండ్ లు ఎన్నో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు కూడా ఇలా కెప్టెన్సీ విభజన చేసాయి అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
ఇటీవలే టెస్ట్ కెప్టెన్సీపై అజింక్యా రహానే ని అభిప్రాయం కోరగా ఎప్పటికీ మా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ అతను చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ తో తనకు మంచి సమన్వయం ఉంది అంటూ చెప్పిన రహానే.. ఇప్పటికి కూడా మైదానంలో కోహ్లీ తనపై నమ్మకం ఉంచుతాడు అంటూ గుర్తు చేశాడు. అయితే ఇటీవలే టీమిండియా కెప్టెన్సీ విభజన ప్రతిపాదన పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షైన్ లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రహానే కెప్టెన్సీలో ప్రశాంతంగా మ్యాచ్ లు ఆడే టీమిండియాను తాను చూడాలనుకుంటున్నాను అని ఒకవేళ భారత సెలెక్టర్ గా ఉంటే.. అజింక్య రహానే ని టెస్ట్ కెప్టెన్గా తప్పక నియమిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. అలా చేయడం వల్ల విరాట్ కోహ్లి పూర్తిగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టే అవకాశం ఉందని షైన్ లి అభిప్రాయం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారిపోయింది.