
పాక్ టెక్నీక్ బుమ్రాకి అబ్బింది.. అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?
పిచ్ ఎలా ఉంది అన్నది పట్టించుకోకుండా కేవలం గాలి వేగం ఆధారంగా చేసుకుని టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. ఒకప్పుడు పాకిస్తాన్ బౌలర్లు ఈ టెక్నిక్ ఉపయోగించేవారని ఇప్పుడు జస్ప్రిత్ బూమ్రాకు కూడా ఈ కల అభివృద్ధి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారిపోయాయి.
జస్ప్రిత్ బూమ్రా పిచ్ పై ఉన్న పచ్చికని పెద్దగా పట్టించుకోవడం లేదు.. గాలి వస్తున్న దిశనుంచి బంతిని తెలివిగా స్వింగ్ చేయడంలో విజయం సాధిస్తున్నాడు.. ఒకప్పుడు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు ఈ టెక్నిక్తో బౌలింగ్ చేసేవారు.. ఒకప్పుడు అలా బాల్ ని స్వింగ్ చేయడం పాకిస్తాన్ బౌలర్లకు మాత్రమే సొంతమైన కళ. ఇప్పుడు భారత్ నుంచి తొలిసారిగా బూమ్రా ఈ టెక్నిక్ టు బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడున్న బౌలర్లలో ఎవరికీ ఈ టెక్నిక్ పై పెద్దగా అవగాహన లేదు అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు జనవరి 7వ తేదీ నుంచి మూడో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతుంది. ఇక ఇప్పటికే జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లలో బూమ్రా 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.