బెన్ స్టోక్స్ కు క్షమాపణలు చెప్పిన ఐసీసీ.. ఎందుకో తెలుసా..?
ఇక ఇంగ్లాండ్ జట్టు ఏ ఫార్మాట్ లో మ్యాచ్ ఆడినప్పటికీ బెన్ స్టోక్స్ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా వుంటే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ దశాబ్దంలో క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లు అందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన అవార్డులు ప్రధానం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా మార్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఇందులో బెన్ స్టోక్స్ కూడా స్థానం సంపాదించుకున్నాడు.
కానీ బెన్ స్టోక్స్ ఐసీసీ చేసిన పనికి కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇక బెన్ స్టోక్స్ అసంతృప్తి పై స్పందించిన ఐసీసీ ఏకంగా బెన్ స్టోక్స్ ని క్షమాపణలు కోరడం గమనార్హం. ఇంతకీ ఐసిసి ఏం చేసింది అని అంటారా.. ఈ దశాబ్దంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా ప్రకటించగా వన్డే టెస్ట్ జట్టులో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పేరు కూడా ఉండడం గమనార్హం. ఆయా జట్లలో ఉన్న వారికి ఐసీసీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్యాప్ లను కూడా ప్రధానం చేసింది. అయితే ఐసీసీ ఇచ్చిన క్యాప్ ఆస్ట్రేలియా వేసుకునే బ్యాగీ గ్రీన్ కలర్ లో ఉంది అంటూ బెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్పందించిన ఐసిసి బెన్ స్టోక్స్ కు క్షమాపణలు చెప్పింది.