భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రా

praveen
భారత జట్టు గత కొన్ని రోజుల నుంచి మిడిలార్డర్లో సరైన బ్యాట్స్మెన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది అన్న విషయం తెలిసిందే.  జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మిడిలార్డర్లో క్రీజులోకి వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చ గల ప్రతిభగల బ్యాట్ మెన్ ఎవరు అన్నదానిపై టీమిండియా జట్టు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఇక మిడిలార్డర్లో పటిష్టమైన బ్యాట్ మెన్ ను  వెతికేందుకు ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు టీం ఇండియా మిడిలార్డర్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆడి మెరుపులు మెరిపించిన్నప్పటికీ ఆ ఆటగాళ్లు మెరిపించిన  మెరుపులు కొన్ని మ్యాచ్ లకు మాత్రమే పరిమితం కావడం తో  టీమిండియాకు మిడిల్ ఆర్డర్ సమస్య అలాగే మిగిలిపోయింది.



 గతంలో మహేంద్రసింగ్ ధోని ఫామ్ లో ఉన్న సమయంలో మిడిలార్డర్లో ఐదవ స్థానంలో బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో ఎంతో సమర్థవంతంగా బ్యాటింగ్ చేసేవాడు.  అయితేప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు లో మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా అద్భుతం గా రాణిస్తున్న తీరు అందరి ధీమాను  కలిగిస్తోంది అయితే ఇటీవలే.. భారత జట్టులోని ఆటగాళ్లపై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు వేర్వేరు పాత్రలు పోషించే వేరువేరు స్థానాల్లో ఆడ గలిగే క్రికెటర్లు అవసరం ఎంతైనా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.



 ప్రపంచంలోనే మహేంద్రసింగ్ ధోని బెస్ట్ ఫినిషెర్  అంటూ వ్యాఖ్యానించిన ఆకాశ్ చోప్రా అతనికి కూడా ఒక తోడు కావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు అలాంటి సమయంలో యువరాజ్ తోడుగా నిలిచాడు అంటూ తెలిపాడు ఆకాశ్ చోప్రా. ఇక ఇప్పుడు భారత జట్టులో ధోని లాగానే హార్దిక్ పాండ్యా మంచి ఫినిషర్ గా మారుతున్నాడని  కానీ అతనికి సరైన తోడు కావాలి అంటూ వ్యాఖ్యానించాడు ఆకాష్  చోప్రా. కోహ్లీ కాకుండా మరొక ఫినిషర్ టీమిండియాకు ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. హార్థిక్ పాండ్యా ఒక్కడే అని మ్యాచ్ లను  ముగించడం చాలా కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: